నీటిపారుదల పనులకు రూ.628.78 కోట్లకు అనుమతులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నీటిపారుదల పనులకు రూ.628.78 కోట్లకు అనుమతులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: కోదాడ,హుజూర్ నగర్ పరిధిలోని ప్రాజెక్టు పనులకు రూ.628.78 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం హుజూర్ నగర్ లో ఒక ప్రకటనలో తెలిపారు.

  హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ ఆయకట్టు పనులకు, మునగాల మండలం బరాకత్ గూడెం ఎన్ఎస్ఎల్ బీసీ ఆర్-9 ఆయకట్టు కోసం ప్రత్యేక ప్రెజర్​ మెయిన్ ఏర్పాటు, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కాంక్రీట్ లైనింగ్ పనులకు, సూర్యపేట ఎన్ఎస్ఎల్ బీసీకి  సంబంధించి ప్రతిపాదించిన 5 పనులకు పరిపాలన అనుమతులు లభించినట్లు 
తెలిపారు.