
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల హమీలు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ వైట్పేపర్ డ్రామాలకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ అన్నారు. గ్యారెంటీలను గాలికొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదన్నారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా?
ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నర అని ఒక ప్రకటనలో విమర్శించారు. శ్వేత పత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసమని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్ల తమ ప్రగతి ప్రస్థానం.. ప్రజల ముందు తెరిచిన పుస్తకమని అన్నారు.