
హైదరాబాద్: పార్టీ మారినోళ్లకు సిగ్గు, శరం, లజ్జ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదన్నారు. దీనిపై కోర్టు లో పిటిషన్ వేశానన్నారు. స్థానిక శాసన సభ్యుడు పంపిణీ చేయవచ్చని కోర్టుకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. జీవో ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పిందన్నారు.
రేవంత్ రెడ్డి ఆదేశాలతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా తనను మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అన్న ఏ హోదాతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. తాము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్లమేనన్నారు. ‘ఇవాళ మమల్ని ఇబ్బంది పెడుతున్నారని, రేపు మేము అధికారం లోకి వచ్చాక చూపిస్తాం. నన్ను ఇబ్బంది పెట్టండి కానీ, హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు’ ’ అని ఆయన అన్నారు.