- కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత.. ఇప్పుడెందుకు బీఆర్‌ఎస్‌పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారని బీఆర్ఎస్ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ప్రశ్నించారు. ఎవరి కోసం.. ఏ పార్టీ లాభం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నరని కవితను నిలదీశారు.
ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కింది స్థాయి కార్యకర్త నుంచి పెద్ద లీడర్ల వరకు ఎంతో శ్రమించారని తెలిపారు. అలాంటి వారిని చిన్నచూపు చూసేలా కవిత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, రౌడీయిజంపై పల్లెత్తు మాట అనని కవిత.. బీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారని ఫైర్అయ్యారు.
పదవులు లేకున్నా కేసీఆర్ నాయకత్వంలో సంతోషంగా పనిచేసే ఉద్యమకారులు తమతో ఉన్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్మళ్లా సీఎం కావాలని కోరుకుంటుంటే.. ఆయన కూతురిగా కవిత మాత్రం లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని వివేకానంద్ పేర్కొన్నారు.
