హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 84 వల్ల ఔట్డోర్మీడియా రంగం సమస్యలు ఎదుర్కొంటున్నదని, ఆ జీవోతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్అన్నారు. రాష్ట్రంలో ఔట్‌డోర్ మీడియా రంగంలో 300 నుంచి 400 ఏజెన్సీలున్నాయని, ప్రకటనలు, హోర్డింగ్స్ నిర్వహణ, ఇన్‌స్టాలేషన్ వంటి పనులతో వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు.
మొత్తంగా 5 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. ఈ మేరకు శనివారం తెలంగాణభవన్‌లో ఔట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక దొంగ జీవోను తెచ్చి ఔట్‌డోర్ మీడియా రంగాన్ని కొందరికే కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
