విపక్షాలను టార్గెట్ చేసేందుకే లిక్కర్ కేసు పెట్టిన్రు: ఎమ్మెల్సీ కవిత

విపక్షాలను టార్గెట్ చేసేందుకే లిక్కర్ కేసు పెట్టిన్రు: ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ కేసు పూర్తిగా రాజకీయ కక్షపూరిత కేసు అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత. ఏప్రిల్ 9వ తేదీ మంగళవారంతో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు ఈడీ అధికారులు.  ఈ సందర్భంగా కవిత బీజేపీని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసింది. "నేను చెప్పాల్సింది కోర్టులో చెప్పా.  జైలులో నన్ను  సీబీఐ ప్రశ్నించింది.. నా స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసింది.  విపక్షాలను టార్గెట్ చేసేందుకే లిక్కకేసు పెట్టారు. బీజేపీకి ఓటేయొద్దని తెలంగాణ ప్రజలను కోరుతున్నా" అని చెప్పారు.

 ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ తరపు లాయర్ కోరారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఏప్రిల్ 23వ తేదీ వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.