కంటోన్మెంట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన

కంటోన్మెంట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం పొడిగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆదివారం ఆ పార్టీ అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.  

కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్ కాపీతోపాటు నామినేటెడ్ కుర్చీ నమూనాను కాలబెట్టారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  కంటోన్మెంట్​లో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. సంవత్సరాల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా జీహెచ్‌‌ఎంసీలో కంటోన్మెంట్‌‌ను విలీనం పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.