V6 వెలుగుకు లీగల్ నోటీసులట!కేసీఆర్ ఫాంహౌస్ కు మళ్లిన కొండపోచమ్మ కథనంపై అక్కసు

V6 వెలుగుకు లీగల్ నోటీసులట!కేసీఆర్ ఫాంహౌస్ కు మళ్లిన కొండపోచమ్మ కథనంపై అక్కసు
  • పత్రికా ప్రకటన విడుదల చేసిన బీఆర్ఎస్
  • ‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లిన కొండపోచమ్మ’ కథనంపై అక్కసు

హైదరాబాద్​, వెలుగు: ‘వీ6  వెలుగు’ పై  బీఆర్ఎస్​ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది.  అధికారంలో ఉన్నప్పుడు వెలుగు పత్రికపై నిషేధం పెట్టి,  ప్రకటనలను అడ్డుకొని గొంతు నొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు అధికారం కోల్పోయాక  సైతం తమ పార్టీకి, అగ్రనేతలకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాసినా జీర్ణించుకోలేకపోతున్నది. ఈ నెల 17న ‘వెలుగు’ దినపత్రిక మొదటి పేజీలో ప్రచురిత మైన ‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లిన కొండపోచమ్మ’  అనే వార్త బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధినేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ తాజాగా ‘వీ6 వెలుగు’కు లీగల్​ నోటీసులు పంపినట్లు ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 


ఆ  వార్తను 24 గంటల్లో అన్ని డిజిటల్‌‌‌‌ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని  హెచ్చరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి అవసరాలు, కొండపోచమ్మ సాగర్‌‌‌‌, కాలువల మార్గాలను కేసీఆర్‌‌‌‌ గారి వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ వార్త ప్రచురించారని, ఇందుకు ఆధారాలేమిటని ఆ ప్రకటనలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రశ్నించింది. ‘సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించారా? కాలువల వాస్తవ మార్గాలను ధ్రువీకరించారా? సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారా? ’ అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తింది.  కాగా ‘వీ6 వెలుగు’కు ఇంకా లీగల్​ నోటీసులు అందలేదు. నోటీసులు అందాక అందులో బీఆర్ఎస్​ లేవనెత్తే ప్రతి అంశానికీ  ఆధారాలు బయటపెడ్తామని ‘వీ6 వెలుగు’ స్పష్టం చేస్తున్నది.