న్యూఢిల్లీ: ఈసీఐ పనితీరును నిరసిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. 'ఉంగ్లీతో ఉతేగి -హల్లాబోల్ మార్చ్' పేరిట ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి జంతర్‌మంతర్ వైపు విద్యార్థులు కదం తొక్కారు. ఈ మార్చ్‌కు ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ నాయకత్వం వహించారు. ఆయన చేతిలో 'జ్ఞానేశ్, ఇట్స్ డన్ బ్రో' అని రాసి ఉన్న ప్లకార్డుతో నిరసన తెలిపారు. నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఎక్కి ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
