మేడిపల్లి: దసరా వేళ దొంగల పంజా మేకలు చోరీ..కారులో వచ్చి ఎత్తుకెళ్లిన దొంగలు

మేడిపల్లి: దసరా వేళ దొంగల పంజా మేకలు చోరీ..కారులో వచ్చి ఎత్తుకెళ్లిన దొంగలు

మేడిపల్లి, వెలుగు : దసరాకు మేకలకు డిమాండ్​ఉండడంతో దొంగలు కన్నేసి ఎత్తుకుపోతున్నారు. శనివారం అర్ధరాత్రి కారులో వచ్చిన దుండగులు మేడిపల్లి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలోని ముత్వెల్లిగూడ రోజువారీ మేకల దొడ్డి నుంచి పది మేకపోతులు, మేకలను అపహరించుకుపోయారు. ఘట్​కేసర్​మండలం ముత్వెల్లిగూడకు చెందిన బుర్ర నర్సింహ, బుర్ర అశోక్‌‌ ..మేకలను అమ్ముతుంటారు. 

శనివారం అర్ధరాత్రి వీరు మేకలదొడ్డి వద్ద లేని టైం చూసిన దుండగులు కారులో పది మూగజీవాలను ఎత్తుకుపోయారు. దసరాకు మేకలను అమ్మి ఆదాయం పొందవచ్చని అనుకుంటే..దొంగలు తమ పొట్టగొట్టారని బాధితులు ఆవేదన చెందారు. మేడిపల్లి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.