విద్యార్థిని నర్సింగ్​ చదువుకు అండగా కేటీఆర్​

విద్యార్థిని నర్సింగ్​ చదువుకు అండగా కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు : ఓ విద్యార్థిని నర్సింగ్ ​చదువుకు బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్ ​అండగా నిలిచారు. ఇల్లందు పట్టణంలోని ఆజాద్​నగర్​కు చెందిన అన్నపూర్ణ.. ఆదివారం తెలంగాణ భవన్​కు వచ్చి కేటీఆర్​ను కలిశారు. తన కుమార్తె నర్సింగ్ ​చదివేందుకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్​ ఆమెతో మాట్లాడి.. ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆరా తీశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగుసార్లు ప్రజాదర్బార్​కు వచ్చి.. తన కుమార్తె చదువుకు సాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నానని తెలిపింది.

అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్​రెడ్డిని కలిసేందకు రోజంతా పడిగాపులు కాసినా పోలీసులు లోపలికి పంపలేదని పేర్కొంది. అక్కడే ఉన్న కొందరు తెలంగాణ భవన్​కు వెళ్లి కేటీఆర్​ను కలవాలని తనకు చెప్పారని, అందుకే ఇక్కడికి వచ్చానని వివరించింది. తన కుటుంబ పరిస్థితి దుర్భరంగా ఉందని, బిడ్డ చదువుకు సాయం అందించాలని కోరింది. దీంతో స్పందించిన కేటీఆర్ ​బంజారాహిల్స్​నందినగర్​లోని తన నివాసానికి ఆమెను పిలిపించి రూ.లక్ష చెక్కు అందజేశారు.