బీఆర్ఎస్వీ స్టేట్ ​సెక్రటరీ ప్రశాంత్ ​అరెస్ట్

బీఆర్ఎస్వీ స్టేట్ ​సెక్రటరీ ప్రశాంత్ ​అరెస్ట్
  • సీవీఆర్​ కాలేజీ నుంచి 10 లక్షలు డిమాండ్ ​చేశాడని ఆరోపణలు​ 

గండిపేట, వెలుగు: బీఆర్ఎస్ విద్యార్థి సంఘం(బీఆర్ఎస్వీ) స్టేట్ సెక్రటరీ నాగారపు ప్రశాంత్ ను నార్సింగి పోలీసులు అరెస్ట్​ చేశారు. సిటీలోని సీవీఆర్ ​ఇంజినీరింగ్ ​కాలేజీ మేనేజర్​ శ్రీపతి నారాయణరెడ్డి నార్సింగిలో నివాసం ఉంటున్నాడు. 

ప్రశాంత్ మరో పది మంది అనుచరులతో కలిసి ఇటీవల నారాయణరెడ్డి ఇంటికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. తెలిసినవారికి అడ్మిషన్లు ఇవ్వడంతోపాటు తనకూ రూ. 10 లక్షలు ఇవ్వాలని ప్రశాంత్ డిమాండ్ చేసినట్లు వివరించారు. దాంతో  ఈ నెల 16న సీవీఆర్​ కాలేజీ మేనేజర్​ నారాయణరెడ్డి నార్సింగి స్టేషన్ లో ఫిర్యాదు చేశాడన్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకుని  గురువారం ప్రశాంత్​ను అదుపులోకి తీసుకున్నామని నార్సింగి పోలీసులు చెప్పారు. అతడిని రాజేంద్రనగర్​ కోర్టులో హాజరుపరచగా కోర్టు.. 24 రోజుల పాటు రిమాండ్​ విధించింది.