
- అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై యావత్ దేశం రగిలిపోతుంటే పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు తెగబడుతూనే ఉంది. ఎల్వోసీ సహా అంతర్జాతీయ సరిహద్దు వెంట కాల్పులకు దిగుతుంది. దీనికి మన సైన్యం దీటుగా జవాబు చెప్తున్నది.
శనివారం ‘హద్దు’ దాటి ఇండియాలోకి ప్రవేశించిన ఓ పాక్ జవాన్‌ను రాజస్తాన్‌లో మన బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. కాగా, గత నెల 23న అనుకోకుండా బార్డర్ క్రాస్ చేసిన మన జవాన్ పీకే షాను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ ఇప్పటికీ తిరిగి అప్పగించేందుకు నిరాకరిస్తూనే ఉంది.