బోర్డర్ దాటొచ్చిన పాకిస్థానీ.. సేఫ్‌గా అప్పజెప్పిన ఇండియన్ ఆర్మీ

బోర్డర్ దాటొచ్చిన పాకిస్థానీ.. సేఫ్‌గా అప్పజెప్పిన ఇండియన్ ఆర్మీ

పొరబాటున బోర్డర్‌‌ దాటి భారత్‌లోకి వచ్చిన పాకిస్థాన్‌ను చెందిన ఓ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారులు తిరిగి అప్పగించారు. పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు దాటించి, పాకిస్థాన్ రేంజర్లకు అప్పజెప్పారు.

ఈ నెల 26న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పొరబాటున బోర్డర్ దాటి పంజాబ్‌లోకి వచ్చాడు. ఇది గుర్తించిన మన జవాన్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పొరబాటున వచ్చాడా? లేక ఏదైనా దురుద్దేశంతో సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడ్డాడా? అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే అతడు తెలియక పొరబాటుగా భారత్‌లో ప్రవేశించాడని తేలడంతో ఎటువంటి కేసు పెట్టకుండా వదిలేశారు. మానవతా దృక్పథంతో అతడిని సేఫ్‌గా శనివారం పాక్ రేంజర్లకు అప్పగించామని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.