లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు

లోక్ సభ ఎన్నికల్లో  బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు

తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖరారయ్యింది. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. ఇవాళ నందినగర్ లో ని మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  మీడియాతో మాట్లాడారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ నుంచి తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పారు ఆర్ఎస్ కుమార్. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులు సంతోషంగా లేరని... రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. బీజేపీ పెద్ద ఎత్తును కుట్రలు చేస్తుందన్నారు.  యావత్ భారత దేశంలో లౌకిక తతకవం ప్రమాదంలో ఉందన్నారు. తెలంగాణ ప్రజలు తమను ఆశీర్వదిస్తారనే నమ్మకుం ఉందన్నారు.

ALSO READ :- చాక్ పౌడర్, గంజితో ట్యాబ్లెట్లు తయారు : హైదరాబాద్లో ఊహించని మాఫియా

బీఎస్పీతో పొత్తుపై  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో  చర్చించామని  కేసీఆర్ చెప్పారు. రేపు బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడుతామన్నారు.  బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని వెల్లడించారు. పొత్తు విధివిధానాలు, సీట్ల సర్దుబాటుపై త్వరలో చెబుతామని తెలిపారు.