కొమురం భీం జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయాలి: RS ప్రవీణ్ కుమార్

కొమురం భీం జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయాలి: RS ప్రవీణ్ కుమార్

కొమురం భీం జిల్లాలో కోట్ల అవినీతి జరుగుతోందని BSP స్టేట్ చీఫ్ RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యేల అక్రమాలకు జిల్లా కలెక్టర్ సహకరిస్తున్నారని, జిల్లా కలెక్టర్ రాహుల్ ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని, అధికారులు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నారు.  

సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆరోపించారు. అన్నింటికి బాధ్యుడైన కలెక్టర్ పై చర్యలు తీసుకునే వరకూ  పోరాడుతామన్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం మహా ధర్నాలో పాల్గొని మాట్లాడారు.