2023లో వచ్చేది బహుజన రాజ్యమే

2023లో వచ్చేది బహుజన రాజ్యమే

2023లో బహుజన రాజ్యం రాబోతుందన్నారు బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగురుతుందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పర్యటించారు ప్రవీణ్ కుమార్. కట్టకొమ్ముగూడెంలో భారీ ర్యాలీతో ప్రవీణ్ కి ఘన స్వాగతం పలికారు ఆ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. బహుజన రాజ్యంతోనే బడుగుబలహీన వర్గాల బతుకులు మారుతాయన్నారు ప్రవీణ్ కుమార్.