
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: చెక్ డ్యామ్‌లో కొట్టుకుపోయిన బీటెక్ విద్యార్థి ఆచూకీ 32 గంటలు గడుస్తున్నా దొరకలేదు. రసూల్‌పురకు చెందిన సాయితేజ (17) తన స్నేహితులతో కలిసి ఆదివారం రంగారెడ్డి జిల్లాలోని సంఘీ టెంపుల్‌కు వెళ్లాడు. దర్శనం తర్వాత రాంబాయ్ చెక్ డ్యామ్ వద్దకు వచ్చాడు.
అక్కడ నీళ్లల్లో ఆడుతూ ఫొటో దిగుతుండగా, వరద నీటిలో కొట్టుకుపోయాడు. సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్వో సుదర్శన్ రెడ్డి, ఇన్స్ పెక్టర్ అశోక్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ శీనయ్య తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. బోట్‌తో కూడా సర్చ్ చేసినా ఆచూకీ లభించలేదు. తన కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.