
ఈత సరదా ప్రాణం తీసింది. హాలిడే కదా అని జాలీగా ఎంజాయ్ చేద్దామనుకున్న యువకులకు సండే విషాదాంతాన్ని మిగిల్చింది. మూసీ నదిలో ఈతకు వెళ్లిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో జరిగింది.
హైదరాబాద్ బోరబండ నుంచి గూగుల్ మాప్ చూసుకుంటూ రాజేంద్రనగర్ కు వచ్చిన అక్షిత్ రెడ్డి తన ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. నలుగురు ఈత కొడుతుండగా.. ఒక్కసారిగా అక్షిత్ రెడ్డి మూసీలో గల్లంతయ్యాడు. అక్షిత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేశాడు మరో స్నేహితుడు . అయితే అక్షిత్ రెడ్డిని చేయి పట్టుకొని లాగే ప్రయత్నం చేయగా.. చేతిలోని నుంచి జారిపోయాడని చెప్పాడు.
ALSO READ | మైనర్లకు బైక్ ఇస్తున్నారా..? హైదరాబాద్లో అతివేగంతో వీళ్ల పరిస్థితి ఏమయ్యిందో చూడండి !
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన అక్షిత్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన అక్షిత్ రెడ్డి బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నట్లు చెప్పారు.