మైనర్లకు బైక్ ఇస్తున్నారా..? హైదరాబాద్లో అతివేగంతో వీళ్ల పరిస్థితి ఏమయ్యిందో చూడండి !

మైనర్లకు బైక్ ఇస్తున్నారా..? హైదరాబాద్లో అతివేగంతో వీళ్ల పరిస్థితి ఏమయ్యిందో చూడండి !

వెహికిల్ నడిపే వయసు ఉండదు, కనీసం లైసెన్స్ కూడా ఉండదు.  కానీ రోడ్లపై మైనర్స్ స్టంట్స్ చేస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు అతివేగంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఆదివారం (జులై 27) హైదరాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం ఆ మైనర్ల కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. 

కుత్బుల్లాపూర్  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీపీఎల్ గాంధీనగర్ దగ్గర ఆదివారం (జులై 27) ఘోర రోడ్డు సంభవించింది. రోడ్డుపై ఆగి ఉన్న డీసీయం ను ముగ్గురు మైనర్లు అతివేగంతో బైక్ నడుపుతూ వచ్చి వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శివ(18), సూరజ్ (17), బోలు(17) లకు తీవ్రగాయాలయ్యాయి. 

►ALSO READ | సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో ఏడుగురు నిందితులకు రిమాండ్

స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 108లో మల్లారెడ్డి హస్పిటల్ కు తరలించారు. చికిత్స అందిస్తుండగా శివ(18) మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న సూరజ్(17)ను గాందీ హాస్పిటల్ కు తరలించారు.ఈ ముగ్గురు యవకులు బీహార్ కి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.