నాలుగేళ్ల చిన్నారిపై ఎద్దు దాడి.. పరిస్థితి విషమం

నాలుగేళ్ల చిన్నారిపై ఎద్దు దాడి.. పరిస్థితి విషమం

మూగ జీవాల నుంచి చిన్నపిల్లలు, వృద్ధులకు రక్షణ లేకుండా పోయింది. రోడ్డుపై కనిపిస్తే చాలు.. చిన్నపిల్లలపై కుక్కలు, కోతులు దాడులు చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో ఎద్దులు సైతం చేరాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో నాలుగేళ్ల చిన్నారిని ఓ ఎద్దు దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది.

అసలేం జరిగింది..? 

యూపీలోని అలీఘఢ్ లో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చింది. పాపం ఆ చిన్నారికి తన వద్దకు ఓ ఎద్దు వస్తుందని తెలియదు. చిన్నారి గమనించిన ఎద్దు.. రంకెలెస్తూ పరుగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే పొగరుపట్టిన ఉన్న ఎద్దు.. ఎందుకో తెలియదు గానీ పాప వద్దకు అరుస్తూ పరుగెత్తింది. ఈ సమయంలో చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఎక్కడి నుంచో వచ్చిన ఎద్దు పరుగున వచ్చి పాపపై దాడి చేసింది. 
ఈ సమయంలో నాలుగేళ్ల చిన్నారి భయంతో అరుస్తూ అటు ఇటు పరుగెత్తింది. అయినా వదల్లేదు. చిన్నారిని విచక్షణ రహితంగా తొక్కేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలోనే పాపకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఎద్దు బారి నుంచి రక్షించారు. 

తీవ్ర గాయాలపాలైన చిన్నారిని వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన థానా గాంధీ పార్క్ ప్రాంతంలోని ధనిపూర్ మండిలో జరిగింది. ప్రస్తుతం డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. అయితే.. చిన్నారి పరిస్థితి కాస్తా సీరియస్ గానే ఉందంటున్నారు డాక్టర్లు. బెడ్ పై ఉన్న చిన్నారి పరిస్థితి చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారి కూడా గాయాల నొప్పులను భరించలేకపోతోంది. పాప పరిస్థితి చూసి ఆస్పత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని ఎద్దు దాడి చేసిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు తమకు తోచినట్లు కామెంట్స్ చేస్తున్నారు. మూగ జీవాల నుంచి మనుషులకు రక్షణ లేకుండా పోయిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే... పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడు గమనిస్తూ ఉండాలని, లేదంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని గుర్తు చేస్తున్నారు. 

విషయం తెలిసిన తర్వాత మెల్లగా ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్‌ బృందం చేరుకుంది. ఘటనకు సంబంధించిన విషయాన్ని ఆరా తీసింది. ఎద్దును పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. ఈ ప్రాంతంలో చాలా ఎద్దులు రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.