- గత బడ్జెట్లో 3 రైళ్లను ప్రకటించిన కేంద్రం
- బహదూర్ గూడలో 650 ఎకరాల గుర్తింపు
- అతిపెద్ద రైల్వేహబ్ గా మారనున్న శంషాబాద్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: శంషాబాద్ కేంద్రంగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలను అనుసంధానించే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి శంషాబాద్ మండలంలోని బహదూర్ గూడలో రైల్వే అధికారులు 650 ఎకరాలను గుర్తించారు. దేశంలోనే అతిపెద్ద హై స్పీడ్ రైల్ హబ్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు,చెన్నై, పుణెల మధ్య ఈ హై స్పీడ్ ట్రైన్స్ నడవనున్నాయి. గత ఫిబ్రవరిలో ప్రకటించిన రైల్వే బడ్జెట్లో తెలంగాణకు మూడు హైస్పీడ్ రైళ్లను కేంద్రం ప్రకటించింది.
ఇవి కూడా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలపగా, శంషాబాద్లోనే ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్శ్రీవాస్తవ కూడా వెల్లడించారు. దీనికి సంబంధించి భూముల కోసం పరిశీలన జరుపుతున్న అధికారులు శంషాబాద్మండలంలోని బహదూర్‌గూడలో 650 ఎకరాలు గుర్తించారు. ఇక్కడి నుంచే కేంద్రం ప్రకటించిన హైస్పీడ్ రైళ్లను నడపనున్నారు. దీంతో శంషాబాద్దేశానికి అతిపెద్ద రైల్వేహబ్ గా, ప్రధాన నగరాలను కలిపే ఏకైక హైస్పీడ్ కారిడార్‌గా అభివృద్ధి కానున్నది.
ఈ ప్రాజెక్టు రాకతో శంషాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో లోకల్ట్రాన్స్పోర్ట్డెవలప్అవుతుందని, పారిశ్రామికంగా భారీ ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంతో దేశంలోనే ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిన శంషాబాద్.. తాజాగా హైస్పీడ్ రైల్ హబ్ఏర్పాటుతో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
రూ. 48వేల కోట్లతో ప్రాజెక్టు
హైస్పీడ్రైల్కారిడార్ను రూ. 48వేల కోట్లతో నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. భూముల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే హైదరాబాద్-– బెంగళూరు, హైదరాబాద్-–చెన్నై కారిడార్ల డీపీఆర్రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. తర్వాత 2027–-28లో హైదరాబాద్– పుణె కారిడార్డీపీఆర్ సిద్ధమవుతుందన్నారు.
హైస్పీడ్ రైళ్లతో ప్రయాణ సమయం ఆదా
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే 8 నుంచి 10 గంటలు, పుణెకు 10 నుంచి 11 గంటలు, చెన్నైకి 8గంటల నుంచి 9 గంటలు పడుతోంది. మూడు కారిడార్లకు సంబంధించి హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌నుంచి బెంగళూరుకు 2 గంటలు, చెన్నై కి 2.55 గంటలు, పుణెకు 1.55 గంటలు మాత్రమే పడుతుంది.
దీంతో ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలు ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఎవరైనా ఒకే వర్కింగ్డేలో మూడు నగరాల్లో ఏ సిటీకి అయినా అతి తక్కువ సమయంలో వెళ్లిపోవచ్చు. ఈజీ, స్పీడ్కనెక్టివిటీ వల్ల వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

