
మేడిపల్లి, వెలుగు: ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు చెంగిచర్ల డిపో మేనేజర్కె.కవిత తెలిపారు. ప్రతిరోజు తెల్లవారు జామున 4.20 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. మణుగూరు, చెన్నై ఎక్స్ప్రెస్ స్పెషల్రైళ్లు తెల్లవారుజామునే చర్లపల్లికి చేరుకుంటున్నాయని, ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.
చర్లపల్లి స్టేషన్నుంచి మల్లాపూర్, హబ్సిగూడ మీదుగా సికింద్రాబాద్వెళ్లే 250 సీ రూట్ బస్సులు ఉదయం 4.20 గంటల నుంచి రాత్రి 10 వరకు(10 నిమిషాలకో బస్సు), చర్లపల్లి స్టేషన్నుంచి ఉప్పల్ మీదుగా చార్మినార్ వెళ్లే 71ఏ బస్సులు ఉదయం 5.20 నుంచి రాత్రి 8.40 గంటల వరకు(20 నిమిషాలకో బస్సు), చర్లపల్లి స్టేషన్నుంచి పటాన్ చెరుకు ఉదయం 4.25 నుంచి 9.50 గంట వరకు(అరగంటకో బస్సు) పటాన్ చెరువు నుంచి చర్లపల్లి స్టేషన్కు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3.15 వరకు(అరగంటకో బస్సు).
చర్లపల్లి స్టేషన్నుంచి ఈసీఐఎల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే18 హెచ్ బస్సులు ఉదయం 4.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు(10 నిమిషాలకో బస్సు), చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్, ఎల్ బీ నగర్ మీదుగా మెహిదీపట్నం వెళ్లే 300 నంబర్బస్సులు తెల్లవారు జామున 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, ఉప్పల్, రామంతాపూర్, హిమాయత్ నగర్ మీదుగా బోరబండకు వెళ్లే 113ఎఫ్ నంబర్బస్సులు ఉదయం 8.35 గంటల నుంచి రాత్రి 7.35 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.