T20 World Cup: గంభీర్, సూర్యలకు తలనొప్పిగా మారిన జట్టు ఎంపిక.. భారత తుది జట్టు ఇదేనా..?

T20 World Cup: గంభీర్, సూర్యలకు తలనొప్పిగా మారిన జట్టు ఎంపిక.. భారత తుది జట్టు ఇదేనా..?

T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. కాసేపట్లో కొలంబోలో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తో  టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్–Aలో అగ్రస్థానంలో నిలిచి, సూపర్–8కి వెళ్లే అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు పెద్ద ఊరట లభించింది. అనారోగ్యంతో నమీబియా మ్యాచ్‌కు దూరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. అతని రాకతో సంజూ శాంసన్ పై వేటు పడనుంది. అభిషేక్– ఇషాన్ కిషన్ కలిసి ఓపెనింగ్ చేయనున్నారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఇషాన్ పాక్‌పై ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు. మూడో స్థానంలో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయనున్నారు. ఈ టోర్నీలో భారత్ కొన్ని మ్యాచ్‌లలో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ కుప్పకూలిన సందర్భాలు ఉండటంతో.. మిడిల్ ఆర్డర్ పాత్ర చాలా కీలకం కానుంది.

ALSO READ : పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 10.1 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్

హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా జట్టుకు అదనపు బలం ఇస్తున్నారు. చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడే బాధ్యతను రింకు సింగ్ కు అప్పగించింది టీమ్ యాజమాన్యం. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి జట్టులో స్థానం దక్కించుకుంటారు. కుల్దీప్ యాదవ్ ని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. పాక్ తో జరిగే మ్యాచ్ కి టీమిండియాను ఎంపిక చేయడం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లకు తలనొప్పిగా మారింది. 

భారత జట్టు అంచనా: 
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.