మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాట్ చేయండి .. ట్రేడర్లకు పిలుపిచ్చిన కైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాట్ చేయండి .. ట్రేడర్లకు పిలుపిచ్చిన కైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఇండియా మధ్య నెలకొన్న డిప్లమాటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇష్యూ నేపథ్యంలో ఈ ఐలాండ్ దేశంతో బిజినెస్ డీలింగ్స్ తగ్గించుకోవాలని ట్రేడర్ల అసోసియేషన్ కైయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పిలుపిచ్చింది. ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ మినిస్టర్లు  చేసిన కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహించబోమని ఈ సంస్థ (కాన్ఫడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ) సెక్రెటరీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్ ఖండేల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. 

ఇందుకు నిరసనగా మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాట్ చేయాలని బిజినెస్ వర్గాలను కోరారు. బలమైన మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపాలంటే బిజినెస్ కమ్యూనిటీ కలిసి ఉండాలని ఖండేల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మరోవైపు ఇండియన్ ఛాంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐసీసీ) కూడా మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేయొద్దని  ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లను కోరింది. బదులుగా లక్షద్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, అండమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ నికోబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేయాలంది.  కాగా, తమకు ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్టినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లక్షద్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోదీ చిత్రికరిస్తున్నారని  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ మినిస్టర్లు విమర్శించారు.