ఇష్టపడి.. ఆశపడి.. : టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన మహిళా వ్యాపారవేత్త

ఇష్టపడి.. ఆశపడి.. : టీవీ యాంకర్ ను కిడ్నాప్ చేసిన మహిళా వ్యాపారవేత్త

ఎప్పుడో చెప్పెను బ్రహ్మంగారు అన్నట్లు.. మొన్నటి వరకు అమ్మాయిలను కిడ్నాప్ చేయటం చూశాం.. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను కిడ్నా్ప్ చేయటం చూస్తున్నాం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి..  ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో పార్ట్ టైం ఇంటర్వ్యూలు చేసే యాంకర్ ను ఇష్టపడి..  కిడ్నాప్ చేసి బంధించింది ఓ మహిళా వ్యాపారవేత్త. హైదరాబాద్ సిటీలో సంచలనం రేపిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భోగిరెడ్డి త్రిస్నా అనే యువతి.. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తుంది. నాలుగు స్టార్టప్ కంపెనీల ఫౌండర్ కూడానూ.. ఈ యువతి భారత్ మ్యాట్రిమోనీలో యాంకర్ ప్రవీణ్ ఐడీని గుర్తించింది. ఫొటో చూసి ట్యాగ్ చేసింది. ఇద్దరూ మంచిగా మాట్లాడుకున్నారు. ఈ సమయంలో త్రిస్నా.. యాంకర్ ప్రవీణ్ అంటే బాగా ఇష్టపడింది. మరింత దగ్గర కావాలని నిర్ణయించుకున్నది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ప్రొఫైల్ ఐడీలో యాంకర్ ప్రవీణ్ ఫొటోలు, ప్రొఫైల్ అయితే ఉన్నాయి కానీ.. అది క్రియేట్ చేసింది ప్రవీణ్ కాదని.. కొందరు వ్యక్తులు.. ప్రవీణ్ ఫొటోతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారని తెలిసింది. ఈ విషయాన్ని త్రిస్నానే.. ప్రవీణ్ కు చెప్పింది. ఈ ఫేక్ ఐడీపై అప్పట్లోనే సైబర్ క్రైంకు కంప్లయింట్ చేశాడు ప్రవీణ్.. 

అక్కడి నుంచి ఇద్దరి మధ్య కొంచెం ర్యాపో పెరిగింది. ఈ విషయంలో త్రిస్నా బాగా ఇష్టపడినా.. ప్రవీణ్ మాత్రం చాలా లైట్ తీసుకున్నాడు. మాట్లాడటం, కలవటానికి కూడా ఇష్టపడేవాడు కాదు ప్రవీణ్.. దీంతో కోపం పెంచుకున్నది త్రిస్నా.. ఇష్టపడిన ప్రవీణ్ నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో.. హైదరాబాద్ సిటీలో ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న ప్రవీణ్ ను కిడ్నాప్ చేయించింది. బంధించింది. కొట్టింది. కిడ్నాపర్లతో మంచిగా మాట్లాడుతూ.. అక్కడి నుంచి తప్పించుకుని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు ప్రవీణ్. కిడ్నాపర్లు కొట్టటంతో.. చెవికి గాయం కూడా అయ్యింది. 

కంప్లయింట్ తీసుకున్న ఉప్పల్ పోలీసులు.. త్రిస్నాను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. కిడ్నాప్ చేయించిన విషయాన్ని అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ప్రవీణ్ పై ఇష్టంతోనే.. త్రిస్నా ఈ కిడ్నాప్ చేయించినట్లు తెలిపారు పోలీసులు. ప్రవీణ్ కు 40 లక్షలు ఇచ్చానంటూ త్రిస్నా చెబుతున్నదని.. వాటికి సంబంధించి ఆధారాలు లేవని.. కిడ్నాప్ వరకు సాక్ష్యాలు ఉన్నాయని వెల్లడించారు పోలీసులు. ప్రవీణ్ వైపు నుంచి ఎలాంటి తప్పులేదని.. అతనిపై ఇష్టంతోనే యువతి త్రిస్నా కిడ్నాప్ చేయించినట్లు వివరించారు మల్కాగిజిరి ఏసీపీ పురుషోత్తంరెడ్డి. 

కాలం మారింది.. ఇష్టపడితే అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేయగలరని త్రిస్నా ఘటన చెబుతోంది.. మొన్నటికి మొన్న టీచర్ ను లవ్ చేసిన అమ్మాయి.. వాళ్ల ఫ్యామిలీ ఫొటోలను మార్ఫింగ్ చేసి రచ్చ రచ్చ చేసింది.. కలికాలం బాస్.. కలికాలం..