రీ-రిలీజ్లో రికార్డులన్నీ బ్రేక్.. మడతపెట్టి కొట్టిన మహేష్

రీ-రిలీజ్లో రికార్డులన్నీ బ్రేక్..  మడతపెట్టి కొట్టిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri jagannadh) కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బిజినెస్ మేన్(BusinessMan). 2012 జనవరి 13న ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు.. అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో సూర్యా భాయ్(Surya bhai) గా మహేష్ బాబు తన విశ్వరూపమ్ చూపించారు. ఆ పాత్ర ఆయన తప్ప ఎవరు చేయలేరు అనే రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మహేష్. ఇక కాజల్ అగర్వాల్(Kajal agarwal) కూడా తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేసింది. 

ఇక తాజాగా ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా బిజినెస్ మేన్ సినిమాను రీ రిలీజ్ చేయడంతో.. మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ రీ రిలీజ్ లో బిజినెస్ మేన్ సినిమాకు పెద్ద ఎత్తున వసూళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. రీ రిలీజ్ లో ఈ సినిమా ఏకంగా రూ.5.31 లక్షల గ్రాస్ వసూలు చేసిందని సంచారం. ఇప్పటివరకు రీ రిలీజైన సినిమాల్లో ఇదే ఆల్ టైం రికార్డు. ఏరియాల వారీగా చూసుకుంటే నైజాం– 2.5 కోట్లు, ఈస్ట్ గోదావరి- – 26.5 లక్షలు, సీడెడ్ – 35.6 లక్షలు, గుంటూరు – 31.4 లక్షలు, నెల్లూరు – 7.13 లక్షలు, వెస్ట్ గోదావరి – 15.28 లక్షలు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. రూ4.42 కోట్లు, ఓవర్ సీస్లో 35 లక్షలు.. మొత్తంగా రూ.5.31కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది బిజినెస్ మేన్ మూవీ.