ఎండాకాలంలో అమృతం.. మజ్జిగతో మీకు ఆరోగ్యం

ఎండాకాలంలో అమృతం.. మజ్జిగతో మీకు ఆరోగ్యం

ఎండాకాలం వేడిమిని తట్టుకోవడానికి మజ్జిగ కు మించిన డ్రింక్ మరొకటి లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా ఇట్టే తాగేయగలరు. మజ్జిగను కొన్నిప్రాంతాలలో సల్ల అని కూడా అంటారు.  అయితే మజ్జిగను.. దేశం మొత్తం ఒక్కో రకంగా తయారు చేసుకుంటారు. కొందరు కేవలం ఉప్పు వేసుకుంటే మరొ కొందరు చెక్కర వేసుకుని తాగుతారు. అయితే ఇప్పుడు మనం మజ్జిగ మనకు ఎలా ఉపయోగ పడుతుందో తెలుసుకుందాం..

పెరుగును చిలికి  పెప్పర్, జీరా,  పుదీనా, కొత్తిమీర, ఉప్పు మరియు పచ్చి మిరపకాయలతో మజ్జిగను  తయారు చేస్తారు. అయితే.. ఎవరి టేస్ట్ కు తగ్గట్టు వారు ఆయా దినుసులను అధికంగా వాడుతారు.  ఢిల్లీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు.. మజ్జిగ గురించి మాట్లాడుతూ ఇది అద్భుతమైన డ్రింక్ అని.. ఎండాకాలంలో శరీరాన్ని కూల్ చేయడంలో మజ్జిగని మించినది లేదని అన్నారు. జీర్ణ వ్యవస్తను, స్థూల, సూక్ష్మ పోషకాలు లభించడంతో పాటు.. రోగనిరోదక శక్తికి మజ్జిగ తోడ్పడుతుందని తెలిపారు.

మజ్జిగ యొక్క ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు:

సంపన్నమైన పోషకాలు
శరీరానికి కావలసిన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా మజ్జిగ లో ఉంటాయి. ఇది కాల్షియం, ప్రోటీన్, ఫాస్ఫరస్, ఇనుము, పొటాషియం, సోడియం మరియు జింక్ వంటి విటమిన్లు A, D, E మరియు B. తో పాటు ఇతర పోషకాలను కలిగి ఉంటుంది.

వేడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది
మజ్జిగ మీ మొత్తం శరీరం మీద శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు తిన్న ఆహారంలోని మసాలాలను వాటి ఎఫెక్ట్ ను తగ్గించి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. మసాలా ఫుడ్ తినడం వల్ల కలిగే మంటలను సైతం క్షణంలో తగ్గిస్తుంది.

జీర్ణక్రియకు మంచిది
ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలు ఎదుర్కొంటుంటే, మజ్జిగ గొప్ప సహాయకారిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియ వలన ప్రేగుకు అంటుకొనే అతిసారాన్ని తగ్గించడానికి సహాయపడే యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మజ్జిగ ఆహారనాలిక ను శద్ది చేయడానికి ఉపయోగపడుతుందని న్యూట్రీషన్లు తెలిపారు.

కాల్షియంలో రిచ్
మజ్జిగలో క్యాల్షియం శాతం ఎక్కువగా ఉంటుందని తెలిపారు న్యూట్రీషియన్లు. లస్సి వలన మనిషి దేహం లో ఉన్న ఎముక గట్టి పడడంతో పాటు.. అస్థిపంజరాన్ని బలంగా ఉంచుతుంది.  అంతేకాక, అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది. 

బరువు కంట్రోల్ లో
బరువుతో బాధపడేవారికి మజ్జిగ గొప్పనైన ఎంపిక. దీన్ని ప్రతీ గోజు తాగడం వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది. ఇది అనారోగ్యాన్ని ఇచ్చే వ్యర్థ ఆహారాల నుండి దూరంగా ఉండటానికి మీ ఆకలిని సంతృప్తిపరచడానికి సహాయపడుతుంది.  ఇంకెందుకు ఆలస్యం మీ డైట్ లో మజ్జిగను భాగం చేసుకోండిమరి.