రేపు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ..కొత్తగా 12 మంది ప్రమాణం.?

రేపు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ..కొత్తగా 12 మంది ప్రమాణం.?

రేపు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎంగా..ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అప్పటినుంచి ఇద్దరితోనే కేబినెట్ కొనసాగుతోంది. అయితే నెల రోజులకుపైగా ఇద్దరితోనే కేబినెట్ కొనసాగడంపై పలు విమర్శలు రావడంతో మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సీఎం షిండే సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు సమాచారం. 

15 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక డిప్యూటీ సీఎం అయిన ఫడ్నవీస్ హోంమంత్రిగా బాధత్యలు చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ మంత్రులకు జాబితాలో చోటు దక్కే  అవకాశం ఉంది. ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఎంపీగా ఉన్న బారామతిలో బీజేపీని పటిష్ఠం చేసేందుకు సమన్వయ బాధ్యతలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అప్పగించినట్లు ఫడ్నవీస్ ప్రకటించారు.