ఆయిల్​ను వెతకడానికి 3 ఏండ్లలో 30‌‌ వేల కోట్లు!

ఆయిల్​ను వెతకడానికి 3 ఏండ్లలో 30‌‌ వేల కోట్లు!

 

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్, వెలుగు: ఆయిల్‌‌‌‌ను వెలికి తీసే వేదాంత సబ్సిడరీ కంపెనీ  కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్, దేశంలో తమ ప్రొడక్షన్‌‌‌‌ను మరింత పెంచాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అయిన కెయిర్న్,  కొత్త ఆయిల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌లను గుర్తించడానికి,  ఉన్న ఆయిల్ బ్లాక్‌‌‌‌ల నుంచి  ప్రొడక్షన్‌‌‌‌ను పెంచడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తామని ప్రకటించింది. గత కొన్నేళ్లను పరిశీలిస్తే,  ఆయిల్ ఇండస్ట్రీలో  కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలు సైతం వెనకడుగేస్తున్న విషయాన్ని గమనించొచ్చు.   బిలియనీర్ అనిల్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ మాత్రం  ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల విషయంలో  రెడీగా ఉన్నామని అంటోంది. ఇంకో మూడేళ్లలో 4 బిలియన్ డాలర్లు (రూ. 30,400 కోట్ల)ను ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్స్ వేసుకున్నామని  కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌  ప్రచుర్ షా‌‌‌‌ పేర్కొన్నారు. షేల్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ (ఒక విధమైన రాళ్ల నుంచి ఆయిల్ తీయడం) పై కూడా  కంపెనీ ఫోకస్ పెంచుతోంది. 

రోజుకి 5 లక్షల బ్యారెళ్లకు ప్రొడక్షన్‌‌‌‌..

ప్రస్తుతం క్రూడాయిల్ రేట్లు హై లెవెల్‌‌‌‌లో ఉన్నాయి.  ఇలాంటి టైమ్‌‌‌‌లో తమ ప్రొడక్షన్‌‌‌‌ను మరింత పెంచుతామని కంపెనీ ప్రకటించింది. దేశంలో ప్రొడ్యూస్​ అవుతున్న మొత్తం ఆయిల్‌‌‌‌లో సగం వాటాకు చేరుకోవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నామని  ప్రచుర్ షా అన్నారు. ప్రస్తుతం కంపెనీ సగటును రోజుకి 1,70,000 బ్యారెళ్లను ప్రొడ్యూస్​ చేస్తోంది. ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ను  5,00,000 బ్యారెళ్లకు పెంచాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. తాజాగా రాజస్థాన్‌‌‌‌లోని  బార్మెర్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌లో షేల్  ప్రొడక్షన్‌‌‌‌ను కంపెనీ స్టార్ట్ చేసింది. దీంతో తమ ఆయిల్ ప్రొడక్షన్ మరింత పెరుగుతుందని అంచనావేస్తోంది. ఆయిల్ ఎక్స్‌‌‌‌ప్లోరేషన్‌‌‌‌పై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నామని  ప్రచూర్ షా అన్నారు.  దేశ ఆయిల్ అవసరాల్లో 85 శాతం వాటాను దిగుమతుల ద్వారానే చేరుకుంటున్నాం. లోకల్ కంపెనీలు తమ ఆయిల్ ప్రొడక్షన్‌‌‌‌ను పెంచితే దేశ దిగుమతులు కొంత వరకు తగ్గుతాయి. ప్రభుత్వం కూడా ఆయిల్‌‌‌‌ను వెతకడానికి కంపెనీలకు మద్ధతిస్తోంది. సస్టయినబుల్ విధానాల్లో ఆయిల్‌‌‌‌ను వెతకడానికి చర్యలు తీసుకుంటున్నామని షా పేర్కొన్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. గత మూడేళ్లలో 2.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశామని చెప్పారు.  తాజాగా కొన్ని ఆయిల్  అండ్ గ్యాస్ బ్లాక్‌‌‌‌లను కూడా కెయిర్న్‌‌‌‌ గుర్తించింది. వీటిలో ప్రొడక్షన్ పెంచుతామని చెబుతోంది. 

షేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌..

ఆయిల్ ఇండస్ట్రీలో  షేల్  ముఖ్యమని కంపెనీ చెబుతోంది. దేశంలోని మిగిలిన కంపెనీలతో పోలిస్తే తమ ఆపరేటింగ్ కాస్ట్‌‌‌‌‌‌‌‌ను తక్కువని తెలిపింది. బ్యారెల్‌‌‌‌‌‌‌‌ షేల్ ఆయిల్‌‌‌‌‌‌‌‌ కోసం 40–45 డాలర్లను ఖర్చు చేస్తున్నామని, గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఈ ఖర్చు 50–55 డాలర్లుగా ఉందని ప్రచూర్ షా గతంలో పేర్కొన్నారు.  ఆయిల్ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందించే హల్లిబర్టన్‌‌‌‌‌‌‌‌ అండ్ బేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యూగ్స్‌‌‌‌‌‌‌‌తో టై అప్ అయ్యింది కూడా. సస్టయినబుల్ మార్గాల్లోనే ఆయిల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను పెంచుతామని ప్రచూర్ షా పేర్కొన్నారు. అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ అందుబాటులో ఉందని, వీటిపై ఇన్వెస్ట్ చేయడంతో 2050 నాటికి నెట్‌‌‌‌‌‌‌‌–జీరో కంపెనీగా మారుతామని పేర్కొన్నారు.