మహిళల వాష్​ రూమ్​లో కెమెరా

V6 Velugu Posted on Sep 23, 2021

  • మైనర్​ను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు

జూబ్లీహిల్స్,వెలుగు: మహిళల వాష్ రూమ్​లో  కెమెరా ఆన్ చేసి సెల్​ఫోన్​ను ఉంచిన  మైనర్​ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్ నం.10 లో ఉండే  డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో ఓ యువతి హౌస్ కీపింగ్ విభాగంలో పని చేస్తోంది. బుధవారం సాయంత్రం ఆమె వాష్​ రూమ్​కు వెళ్లింది. బాత్రూం కిటికి వద్ద ఓ సెల్​ఫోన్ ఉన్నట్లు గమనించింది. వెంటనే డ్రైవ్ ఇన్ నిర్వాహకులకు  ఈ విషయం చెప్పింది.  వారు మొబైల్ ను తీసుకుని పరిశీలించి కెమెరా ఆన్ చేసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో సదరు యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.  పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.  డ్రైవ్ ఇన్​లో పనిచేసే ఓ మైనర్ బాత్రూంలో సెల్ ఫోన్ పెట్టినట్లు   నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నల్గొండకు చెందిన ఆ మైనర్​ను డ్రైవ్ ఇన్​లో ఎలా పనిలో పెట్టుకున్నారనేది తెలియాల్సి ఉంది.

Tagged POLICE, Arrested, camera, Minor, Jubileehills, , women washroom

Latest Videos

Subscribe Now

More News