SRH vs MI : దంచికొట్టిన గ్రీన్, తిలక్ వర్మ.. హైదరాబాద్ భారీ టార్గెట్

SRH vs MI : దంచికొట్టిన గ్రీన్, తిలక్ వర్మ.. హైదరాబాద్ భారీ టార్గెట్

ముంబై బ్యాట్స్ మెన్.. హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సర్లు, ఫోర్లో సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సన్ రైజర్స్ కు 193 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్లు మొదలుపెడితే.. మిడిల్ ఆర్డర్ ఫినిష్ చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ (28, 18 బంతుల్లో), ఇషాన్ కిషన్ (38, 31 బంతుల్లో) పవర్ ప్లేలో శుభారంభాన్ని అందించారు. మూడో వికెట్లో వచ్చిన కమేరున్ గ్రీన్ (64, 40 బంతుల్లో) ఫోర్లు, సిక్సర్లు కొడుతూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలలో ముంబై 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 

లోకల్ బాయ్ తిలక్ వర్మ (37, 17 బంతుల్లో) క్రీజులో ఉన్నంతసేపు  స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 18వ ఓవర్ వేసిన నట్రాజన్  బౌలింగ్ లో వరుసగా 3 ఫోర్లు, సిక్స్ తో గ్రీన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ మళ్లీ నిరాశ పరిచాడు. కేవలం 3 బంతులు ఆడిన సూర్య 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. హైదరాబాద్ బౌలర్లలో జాన్సన్ కు 2 వికెట్లు దక్కాయి. నట్రాజన్, భువనేశ్వర్ కు చెరో వికెట్ దక్కింది.