
న్యూయార్క్: భారత్, -కెనడా మధ్య జరుగుతున్న దౌత్య వివాదంపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తాజాగా స్పందించారు. టెర్రరిస్టులకు కెనడా అత్యంత సురక్షితమైన ప్రదేశంగా మారిందన్నారు. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆధారాలు లేకుండానే దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. భారత్ పై చేసిన కామెంట్లనే ఆయన గతంలో శ్రీలంకపైనా చేశారని వెల్లడించారు. తమ దేశంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదనే విషయం అందరికీ తెలుసని చెప్పారు.
ట్రూడో తాజాగా చేసిన ఆధారాలు లేని ఆరోపణలను చూసి తానేమీ ఆశ్చర్యపోలేదన్నారు. కెనడా పార్లమెంట్‌లో ఓ మాజీ నాజీ సైనికుడిని ట్రూడో సత్కరించడంపై అలీ సబ్రీ మండిపడ్డారు. నాజీలతో సంబంధం ఉన్న వ్యక్తిని కెనడా సత్కరించడం సందేహాలకు తావిస్తోందని అన్నారు.