పడిపోయిన ట్రూడో పాపులారిటీ

పడిపోయిన ట్రూడో పాపులారిటీ

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రజాదరణ తగ్గిపోయింది. ఆయనపై ఆ దేశ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఖలిస్థాన్ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్  హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ట్రూడో ఆరోపణల తర్వాత జరిగిన కెనడియన్ గ్లోబల్ న్యూస్ సర్వే రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ట్రూడోకు అపొజిషన్ నేత పియరీ పొయిలీవ్రే చేతిలో ఓటమి తప్పదని రిపోర్టు తెలిపింది. 40 % మంది కెనడియన్లు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పొయిలీవ్రేను ప్రధానిగా చూడాలనుకుంటున్నారని పేర్కొంది. ఆ పార్టీకి 39% ఓట్లు వస్తాయని, లిబరల్ పార్టీకి చెందిన ట్రూడో 30 % ఓట్లకే పరిమితమవుతారని చెప్పింది.  

50 ఏండ్లలో అత్యంత చెత్త ప్రధాని

గత 50 ఏండ్లలో జస్టిన్ ట్రూడో లాంటి అత్యంత చెత్త ప్రధానిని చూడలేదని జులైలో నిర్వహించిన సర్వేలో తేలినట్లు సీటీవీ న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ.. ఖలిస్తానీ సానుభూతిపరుడిగా పేరున్న భారత సంతతికి చెందిన జగ్మీత్​సింగ్ సారథ్యంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2025లో జరిగే ఎన్నికల వరకు  అధికార పార్టీకి తమ మద్దతును వాపస్ తీసుకోబోమంటూ ఎన్డీపీ ప్రకటించింది. నిజ్జర్ హత్య నేపథ్యంలో ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది.