
రాష్ట్రవ్యాప్తంగా SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాతంగా కొనసాగుతోంది. మద్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగనుంది. అయితే ఎగ్జామ్ కు లేట్ అయిన అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. నాగోల్ లోని శ్రీయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎగ్జామ్ కు లేట్ వచ్చిన ముగ్గురిని అలవ్ చేయలేదు.
ఇటు సికింద్రాబాద్ సెంట్ మెరిస్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఓ అభ్యర్ధి పాస్ ఫోటో తీసుకురానందకు అభ్యర్థులను లోపలికి పంపించలేదు. మెదక్ జిల్లా ఎగ్జామ్ సెంటర్ కు ఆలస్యంగా వచ్చిన నలుగురు అభ్యర్ధులు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.
సిద్దిపేటలో కూడా లేట్ వచ్చిన నవీన అనే యువతిని అధికారులు అనుమతించలేదు. ఇక మరికొంత మంది ఎగ్జామ్ సెంటర్లు దొరక్క..ఇబ్బందులు పడ్డారు. సెంటర్ తెలుసుకోని వెళ్లేలోపే సమయం ఐపోవడంతో అధికారులు గేట్లు మూసివేశారు. దీంతో ఎగ్జామ్ మిస్ అయ్యామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.