4 సార్లు వాయిదా.. పరీక్ష తేదీలపై నో క్లారిటీ..

4 సార్లు  వాయిదా..  పరీక్ష తేదీలపై నో క్లారిటీ..

డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ పోస్టులపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 31న 544 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే టెక్నికల్ ఇస్యూస్స్ తో ఇప్పటికే 4 సార్లు దరఖాస్తు గడువును వాయిదా వేసింది. ఈ క్రమంలో పరీక్షా తేదీలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో అప్లికేషన్ చేసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.

లక్షకు పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసిన పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా సరియైన అప్లికేషన్ తేదీలతో పాటు పరీక్ష షెడ్యూల్ ని విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 

తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (జూనియర్‌ కళాశాలలు) ల్లో డైరెక్ట్‌ ప్రాతిపదికన 868 డిగ్రీ లెక్చరర్‌, పీడీ, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో నోటిఫికేషన్ విడుదలైంది. 

ఎన్ని పోస్టులంటే..

 డిగ్రీ లెక్చరర్: 793 పోస్టులు,  ఫిజికల్ డైరెక్టర్: 39 పోస్టులు,  లైబ్రేరియన్: 36 పోస్టులు

డీఎల్‌ సబ్జెక్టు వారీగా ఖాళీలు:

1. తెలుగు: 55 పోస్టులు

2. ఇంగ్లిష్: 69 పోస్టులు

3. మ్యాథ్స్‌: 62 పోస్టులు

4. స్టాటిస్టిక్స్‌: 58 పోస్టులు

5. ఫిజిక్స్: 46 పోస్టులు

6. కెమిస్ట్రీ: 69 పోస్టులు

7. బోటనీ: 38 పోస్టులు

8. జువాలజీ: 58 పోస్టులు

9. కంప్యూటర్ సైన్స్: 99 పోస్టులు

10. జియాలజీ: 06 పోస్టులు

11. బయో కెమిస్ట్రీ: 03 పోస్టులు

12. బయో టెక్నాలజీ: 02 పోస్టులు

13. హిస్టరీ: 28 పోస్టులు

14. ఎకనామిక్స్: 25 పోస్టులు

15. పొలిటికల్ సైన్స్: 27 పోస్టులు

16. కామర్స్‌: 93 పోస్టులు

17. జర్నలిజం: 02 పోస్టులు

18. సైకాలజీ: 06 పోస్టులు

19. మైక్రోబయాలజీ: 17 పోస్టులు

20. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్: 09 పోస్టులు

21. సోషియాలజీ: 07 పోస్టులు

22. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్: 14 పోస్టులు