అభ్యర్థులు ఒత్తిడికి గురికావొద్దు : సిరికొండ లక్ష్మీనారాయణ

అభ్యర్థులు ఒత్తిడికి గురికావొద్దు : సిరికొండ లక్ష్మీనారాయణ

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులు ఒత్తిడికి గురికావొద్దని రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, రామయ్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ చెప్పారు. కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం సరూర్ నగర్ గ్రౌండ్​లో యోగా, మెడిటేషన్, మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ త్వరలో జరుగుతున్నాయని, ఈ నెలలోనే డీఎస్సీ, గురుకుల నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు.

తమ కోచింగ్ సెంటర్లలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఆన్​లైన్, ఆఫ్ లైన్​మోడ్​లలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ రామదాసు, అప్పా ​డైరెక్టర్ శికామణి, ఎల్​బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొని వారి సలహాలు, సూచనలు తెలియజేశారు.