తమిళనాడులో ఎన్నడూ లేని రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మే 4వ తేదీ అత్యంత కీలకంగా మారింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ కీలకం కానున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. మరో వైపు ఎన్నికల ఫలితాల రోజే కోలీవుడ్ బ్యూటీ త్రిష పుట్టిరోజు. ఈ రెండు ఒకే రోజు కావడంతో ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ 'కింగ్ మేకర్' పాత్ర పోషిస్తారా?
ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్‌లో తమిళనాడు ఓటర్లు రికార్డు స్థాయిలో 85% పైగా ఓటింగ్ నమోదు చేసి దేశాన్నే ఆశ్చర్యపరిచారు.అయితే ఈ ఎన్నికల్లో అందరి కళ్ళు స్టార్ హీరో విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రికళగం' (TVK) పార్టీపైనే ఉన్నాయి. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుండి పోటీ చేసిన విజయ్.. అసెంబ్లీలో అడుగుపెట్టి 'కింగ్' అవుతారా లేక ప్రభుత్వ ఏర్పాటులో 'కింగ్ మేకర్' పాత్ర పోషిస్తారా అన్నది మే 4న తేలనుంది. విజయ్‌కు అత్యంత సన్నిహితురాలు కావడంతో త్రిష రాజకీయ ప్రవేశంపై కూడా ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే, తాను ప్రస్తుతానికి సినిమాలకే పరిమితమని ఆమె స్పష్టం చేయడంతో ఆ రూమర్లకు చెక్ పడింది.
త్రిష పోస్ట్ వైరల్..
మరోవైపు, త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మనం ఒక గంట నిద్రను కోల్పోతే, దాన్ని రికవర్ చేయడానికి శరీరానికి నాలుగు రోజులు పడుతుంది. ఆ లెక్కన చూస్తే, నేను పూర్తిగా కోలుకుని సంతోషంగా ఉండటానికి 2062 వరకు సమయం పడుతుంది అంటూ పేర్కొంది. ఈ పోస్ట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. షూటింగ్‌ల వల్ల త్రిషకు నిద్రలేమి సమస్య ఉందా? లేక తన నైట్ లైఫ్ అలవాటును ఇలా సరదాగా చెప్పిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
రెండు దశాబ్దాల క్రేజ్..
రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష, ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. రాజకీయ ఆరంగేట్రంపై ప్రచారం జరిగినప్పటికీ, లేటెస్ట్ ఒక భారీ తెలుగు ప్రాజెక్ట్‌కు సంతకం చేసి తన ఫోకస్ అంతా వెండితెరపైనే అని నిరూపించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘కరుప్పు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తానికి మే 4న త్రిష తన బర్త్‌డే కేక్ కట్ చేసే సమయానికి, అటు చెన్నై కోటపై ఎగిరే జెండా ఏదో కూడా తేలిపోనుంది. అటు రాజకీయ నేతలకు, ఇటు సినిమా ఫ్యాన్స్‌కు ఇది ఖచ్చితంగా సూపర్ సండే కాబోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

