కార్పొరేషన్ ఎన్నికల్లోపే కంటోన్మెంట్ విలీనం చేయాలి : ఎమ్మెల్యే శ్రీగణేశ్

కార్పొరేషన్ ఎన్నికల్లోపే కంటోన్మెంట్ విలీనం చేయాలి : ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • లేకపోతే ఢిల్లీ వరకు పోరాటం
  • రెండో రోజు దీక్షలో ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్​లో విలీనం చేయడమే ఏకైక మార్గమని ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.  కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ వ్యవస్థ రద్దు చేసి వెంటనే విలీన ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల లోపే విలీనం చేయాలని, లేదంటే ఢిల్లీ వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.