పద్మారావునగర్, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. మైనారిటీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు మంజూరు చేయించి పంపిణీ చేయగా, మంగళవారం బోయిన్‌పల్లి, కడక్పుర, పెన్షన్ లైన్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఐకమత్యంతో కష్టపడి వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.
