కోహ్లీలో మార్పు కనిపిస్తే ఏదో సమస్య ఉన్నట్టే

కోహ్లీలో మార్పు కనిపిస్తే ఏదో సమస్య ఉన్నట్టే

టీమిండియా కెప్టెన్ గా తప్పుకున్నప్పటికీ విరాట్ కోహ్లీలో ఎలాంటి మార్పు ఉండదన్నాడు భారత మాజీ క్రికెటర్  గౌతమ్ గంభీర్. నాయకత్వమం అనేది ఒక అదనపు బాధ్యత అని అన్నాడు. ఈ విషయంలో కోహ్లీ కూడా అలాగే ఆలోచిస్తాడన్నాడు.  జట్టులోకి వచ్చిన ఫస్ట్ ఎవరైనా బాగా ఆడాలనుకుంటారు కానీ..ముందు నుంచే కెప్టెన్ అవ్వాలనుకోరన్నాడు. అందుకే కోహ్లీ కూడా ఇపుడు కెప్టెన్ గా లేకపోయినా ఎలాంటి మార్పుండదన్నాడు. ఒక వేళ మార్పు కనిపిస్తే ఏదో సమస్య ఉందని అర్థం అని అన్నాడు.