
- హుజూరాబాద్ కేంద్రంగా రెండేండ్ల నుంచి దందా
- రూ. 70 లక్షల విలువైన 60 క్వింటాళ్లు స్వాధీనం
రైతులకు అమ్మేందుకు సిద్ధం చేసిన నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. నాలుగేండ్లుగా ఈ దందాకు హుజూరాబాద్ కేరాఫ్‌గా మారింది. పక్కా సమాచారంతో ఆఫీసర్లు గురువారం దాడులు చేసి నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గాజుల శ్రీనివాస్ హుజూరాబాద్‌లోని బండఅంకూస్ వాడలోని బొబ్బల రాజిరెడ్డికి చెందిన పాత వరి విత్తనాల గోదాం నుంచి రెండేళ్లుగా నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్నాడని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి లూసు పత్తి గింజలు తెచ్చి, కెమికల్స్, కలర్స్ పూసి వివిధ బ్రాండ్ల పాలిథిన్ కవర్లలో నింపుతున్నాడని, ఒక్కో ప్యాకెట్లో 120 గ్రా. చొప్పున ప్యాక్ చేసి, ఆదిలాబాద్, వరంగల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్జిల్లాలతోపాటు మహరాష్ర్టల్లో అమ్ముతున్నాడు. పక్కా సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖలు కలిసి దాడులు చేశాయన్నా రు. రజనీ సీడ్స్పేర 32 బ్యాగులు, ఎస్ఆర్పేర 11 బ్యాగులతో పాటు 42 బ్యాగుల లూస్ సీడ్స్, 7 గన్నీ బ్యాగులను, 15 కేజీల వీడి విత్తనాలు పట్టుకున్నట్టు చెప్పారు. మొత్తం 49 క్వింటాళ్ల 260 గ్రాముల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని అన్నారు. మూడు ప్యాకింగ్ మిషన్లు, వేయింగ్ మిషన్, ప్లాస్టిక్ కవర్లను కూడా పట్టుకున్నామన్నారు. ఈ దాడుల్లో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీధర్, ఏడీఏ దోమ ఆదిరెడ్డి, టాస్క్‌పోర్స్ ఏసీపీ శోభన్‌కుమార్, ఏసీపీ కృపాకర్, టౌన్ సీఐ వాసంశెట్టి మాధవి పాల్గొన్నారు