కీసరలో కారు బీభత్సం.. పూల వ్యాపారులపైకి దూసుకెళ్లింది..

కీసరలో కారు బీభత్సం.. పూల వ్యాపారులపైకి దూసుకెళ్లింది..

కీసర, వెలుగు: కీసర ప్రధాన కూడలిలో బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. దసరా వేళ రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. రోడ్డుపై కారు స్టార్టింగ్​లోనే పెట్టి ఓనర్ పార్క్​చేసి వెళ్లగా, కొద్దిసేపటికే చిరు వ్యాపారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుమ్మడికాయలు అమ్ముకుంటున్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు హాస్పిటల్​కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.