డిపో మేనేజర్ కారునే ఢీకొట్టిన తాత్కాలిక డ్రైవర్

డిపో మేనేజర్ కారునే ఢీకొట్టిన తాత్కాలిక డ్రైవర్

నల్గొండ : అనుభవంలేని ఆర్టీసీ బస్సు డ్రైవర్ డిపో మేనేజర్ కారునే ఢీకొట్టాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం నల్గొండ ఆర్టీసీ డిపోలో జరిగింది. తాత్కాలిక డ్రైవర్ కు డిపోలో ట్రైనింగ్ ఇస్తుండగా అదుపుతప్పిన బస్సు..పక్కనే ఉన్న డిపో మేనేజర్ కారుకు డాష్ ఇచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న మేనేజర్ డ్రైవర్ పై సీరియస్ అయ్యాడు. ఇలాంటివారిని ఎవరు తీసుకొచ్చారని అధికారులపై మండిపడ్డాడు. అసలే ఆటోలు, ట్రాక్టర్లు, ఇసుక లారీలు నడుపుతున్నవారిని తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తుండగా..ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచిందని చెబుతున్నారు ఆర్టీసీ కార్మికులు.

అనుభవంలేని డ్రైవర్లను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. ఈ సంఘటనను ఆర్టీసీ యాజమాన్యం, పోలీసులు కళ్లారా చూశారని తెలిపారు. ఇకనైన ప్రభుత్వ వైఖరి వీడకుంటే ముందుముందు ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ఆర్టీసీ అధికారులకు చురకలంటించారు కార్మికులు.