వనస్థలిపురంలో కారు బీభత్సం

వనస్థలిపురంలో కారు బీభత్సం

హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఓ కారు షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రోడ్డుపై నడుస్తున్నవారికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికుల ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.