ప్రపంచంలో ఏం జరుగుతుంది : రెండో అంతస్తులోకి కారు ఎలా దూసుకెళ్లింది?

ప్రపంచంలో ఏం జరుగుతుంది : రెండో అంతస్తులోకి కారు ఎలా దూసుకెళ్లింది?

ప్రపంచ వ్యాప్తంగా ఏది జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది.  అది మంచి అయినా .. చెడు అయినా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. కొన్ని కొన్ని విషయాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలోని ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి రెండో అంతస్థులోకి కారును గుర్తించారు. టయోటా కరోలా కారు  ఇంటి పై కప్పుపై వేలాడుతున్నట్లు గుర్తించిన అధికారులు  ధ్వంసం చేశారు.  

అమెరికాలోని పెన్సిల్వేనియాలోని డికాటూర్ టౌన్‌షిప్‌ లో ఆదివారం ( జులై 30) జరిగిన  ప్రమాదంపై ఫైర్ అధికారులు స్పందించారు.  విరిగిన చెక్క ముక్కలు, ఇంకా ఇతర శిథిలాలతో ఇంటి పైకప్పు విరిగి ఆ ప్రాంతం అంతా చిందర వందరగా ఉందని అధికారులు తెలిపారు. డెకాటూర్ టౌన్‌షిప్‌లోని  రెస్క్యూ కంపెనీ వాహనాన్ని తీసుకువెళ్లింది. అయితే ఈ వాహనంలో ఒకరు చిక్కుకున్నారని జంక్షన్ ఫైర్ అధికారులు తెలిపారు.   

 కారు డ్రైవర్ ను  20 ఏళ్ల వ్యక్తిగా గుర్తించినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక తెలిపింది. . డ్రైవర్‌ను వైద్య పరీక్షల కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం అందుతోంది.  కారు  రెండవ అంతస్తుకు ఎలా వెళ్లిందో తెలియడం లేదని అంటున్నారు.  అయితే  ఆ ఇంటి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టడం వల్ల అది గాలిలోకి వెళ్లి ఉండవచ్చని అగ్నిమాపక సంస్థ అభిప్రాయపడింది.

సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో  నెటిజన్లు స్పందించారు.  ప్రపంచంలో ఎలా ఉంటున్నారో అర్దం చేసుకోవడంలేదని కామెంట్ చేశారు.  వాహనాన్ని ఎవరైనా ఇంటి రెండో అంతస్థులో పార్క్ చేస్తారా అని పోస్ట్ పెట్టారు.  ఇది చాలా పిచ్చిగా ఉందని మరొకరు  వ్రాశారు.