రూల్స్ కు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు స్కూల్ బస్సులపై కేసు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిదిలో చేసిన తనిఖీలలో 8 బస్సులపై కేసు నమోదు చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. శారద విద్యా మందిర్ స్కూల్, ఒయాసిస్ స్కూల్, ఎస్ ఆర్ డిజీ స్కూల్, బ్రిలియంట్ స్కూల్స్ కు చెందిన 8 బస్సులను కేసు నమోదు చేశామన్నారు. బస్సులు ఓవర్ లోడుతో వస్తున్నాయని, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవని, ఫైర్ సేఫ్టీ లేకపోవడం, అటేండర్ లేకపోవడం వంటివి ఉండడంతో కేసు నమోదు చేశామని తనిఖీలు ఇంకా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అత్తాపూర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సోనీ చెప్పారు.

