ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!

ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కేసు నమోదైంది. మార్చి27 బుధవారం చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ బండి సంజయ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు  బండి సంజయ్ తోపాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

కేసు ఎందుకు నమోదైందంటే..

 ముస్లింల దాడిలో గాయపడ్డ బాధిత మహిళలను పరామర్శించేందుకు 2024 మార్చి27న  చెంగిచర్లలోని పిట్టలబస్తీకి బండి సంజయ్ వెళ్లారు. బండి రాకతో అక్కడ భారీగా జనం గుమిగూడటంతో అనుమతి లేదని పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో బండి సంజయ్ బారికెడ్లను తోసుకుంటూ పోలీసులను గాయపర్చి లోపలికి వెళ్లారని ఈ మేరకు సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్ పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.