
ప్రగతిభవన్ లోని ఓ పెంపుడు కుక్క చనిపోయిందని డాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నిన్న అనారోగ్యంతో ఉన్న హస్కీ అనే కుక్కపిల్లను డాగ్ హాండ్లర్ కేర్ క్లినిక్ కు తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూనే కుక్కపిల్ల చనిపోవటంతో.. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఫిర్యాదు చేశాడు డాగ్ హాండ్లర్. దీంతో డాక్టర్ పై FIR నమోదు చేశారు పోలీసులు.