80 మంది కొత్త ఎమ్మెల్యేలపై కేసులు.. ఎఫ్​జీజీ సెక్రటరీ పద్మనాభ రెడ్డి

80 మంది కొత్త ఎమ్మెల్యేలపై కేసులు.. ఎఫ్​జీజీ సెక్రటరీ పద్మనాభ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 80 మందిపై కేసులు ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి తెలిపారు. పార్టీల వారీగా కేసులు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను సోమవారం ఆయన వెల్లడించారు. 80 మందిలో 64 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేరచరిత్ర ఉన్న అభ్యర్థులకు పార్టీలు టికెట్లు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు చెప్పినా.. చాలా మందికి పార్టీలు టికెట్లు ఇచ్చాయని ఆయన గుర్తుచేశారు.

కాంగ్రెస్ నుంచి 64 మంది గెలిస్తే  50 మందిపై , బీజేపీ నుంచి 8 మంది గెలిస్తే ఏడుగురిపై, బీఆర్ ఎస్ లో 39 మంది గెలిస్తే 19 మందిపై, ఎంఐఎంలో ఏడుగురు గెలిస్తే నలుగురుపై కేసులు ఉన్నాయని పద్మనాభరెడ్డి వెల్లడించారు. 2018లో గెలిచిన వారిలో 65 మందిపై మాత్రమే కేసులు ఉన్నాయన్నారు.